హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 49 మంది డీఎస్పీల బదిలీ చేస్తూ డీజీపీ ప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు. వెయింటింగ్‌లో ఉన్న 18 మందికి సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్లుగా ఇవ్వటంతో పాటు హైదరాబాద్ నగరంలోనూ కొందరు ఏసీపీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అక్టోపస్ విభాగంలో డీఎస్పీగా ఉన్న జె.భద్రేశ్వర్‌ను శంషాబాద్ ఏసీపీగా నియమించారు. ఏపీఎస్సీలో ఉన్న మహ్మద్ ఇస్మాయిల్‌ను సైఫాబాద్‌కు, సైబర్ క్రైమ్ డీఎస్పీగా పని చేస్తున్న చిట్టి బాబును గోషామాల్ ఏసీపీగా నియమించారు. అనంతపురం, బెల్లంపల్లి, విజయవాడ వైస్, హన్మకొండ, నరసరావుపేట, పెనుకొండ, అమలాపురం, వనపర్తి, నిర్మల్ బీఎస్పీలను ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ చేశారు.




