Monday, 2 November 2026

భాజపా పాలనలో అవినీతిచోటు చేసుకుంది : రాహుల్‌

హైదరాబాద్‌: భాజపా అవినీతి మయమని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన ప్రచార కార్యక్రయంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘భాజపా’ మాకన్నా ప్రజలకు ఎక్కువేమీ చేయలేదు. పైగా అవినీతి అనుసరించడంలో ముందుంటుంది. అందుకు ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ లలో ఆ పార్టీ పాలనే ఉదాహరణ’ అని రాహుల్‌ విమర్శించారు. గిరిజనుల సంక్షేమ కోసం కాంగ్రెస్‌ ‘గిరిజన చట్టాన్ని’ తీసుకోచ్చిందని, రాజస్థాన్‌లో ఇది అమలులో ఉందని అన్నారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో భాజపా ప్రభుత్వం గిరిజనులకు వారి భూములపై ఇప్పటికీ హక్కు ఇవ్వలేదని ఆరోపించారు.రాష్ట్రంలో భాజపా పాలనను, కాంగ్రెస్‌ పాలనను బేరేజూ వేసేకోవాలని ఓటర్లకు సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని ఓటర్లను రాహుల్‌ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *