విభజనకు బడ్జెట్‌కు సంబంధం లేదు
డీలర్ల కమిషన్ పెంపునకు కృషి
మంత్రులు శ్రీధర్‌బాబు, ఆనం
హైదరాబాద్, నవంబర్ 28 (జనంసాక్షి) :
రాష్ట్ర విభజనకు, బడ్జెట్‌కు ఎలాంటి సంబంధం లేదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు, ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. గురువారం సచివాలయంలో పౌరసరఫరాల శాఖపై వీరు సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రేషన్ డీలర్లు, కిరోసిన్ డీలర్ల కమీషన్ పెంపుపై ప్రతిపాదనలు వచ్చాయని అన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విభజనతో బడ్జెట్‌కు ఎలాంటి ఆటంకం లేదని అన్నారు. తాము బడ్జెట్ రూపకల్పనలో నిమగ్నమై ఉన్నామని అన్నారు. ఇప్పటికే వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని అన్నారు. బడ్జెట్ వ్యవహారం ఆన్‌లైన్‌లో ఉంటుందని అన్నారు. డిసెంబర్ నుంచి బడ్జెట్ రూపకల్పనను వేగవంతం చేస్తామని చెప్పారు. అవసరమైతే మంత్రుల స్థాయిలో బడ్జెట్‌పై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. మంత్రులు విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని వస్తున్న వార్తలు అవాస్తవాలని అన్నారు. మంత్రులు తమ సొంత నియోజకవర్గాలలో జరుగుతున్న రచ్చబండలో పాల్గొంటున్నారని అన్నారు. వైఎస్సార్ సిపితో పొత్తు అంశం ఇప్పుడు ప్రస్తావించడం తగదని అన్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో ఎన్నికలకు ముందు హైకమాండ్ నిర్ణయిస్తుందని ఆనం అన్నారు. పౌరసరఫరాల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీచేస్తామని అన్నారు. గ్యాస్‌తో ఆధారకార్డు అనుసంధానంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన విషయంపై కేంద్రం నుంచి తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని అన్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. రేషన్ డీలర్లకు కమీషన్ పెంచాలని నిర్ణయించినట్టు శ్రీధర్‌బాబు చెప్పారు. అసెంబ్లీ ప్రోరోగ్‌కు సంబంధించిన ఫైల్ తన వద్దకు వచ్చిందని, పని ఒత్తిడివల్ల దాన్ని చూడలేకపోయానని శ్రీధర్‌బాబు అన్నారు. కాగా, రాష్ట్ర విభజన తర్వాత ఏయే పార్టీలు కాంగ్రెస్‌లో విలీనం అవుతాయో వారి ఇష్టమని ఆనం పేర్కొన్నారు. పార్టీల విలీనం విషయం పార్టీ కేంద్రకమిటీ చూసుకుంటుందన్నారు.
ఆన్‌లైన్‌లో బడ్జెట్




