ప్రజల హక్కులేం కాపాడుతారు
మోడీపై సిబల్ ఫైర్
న్యూఢిల్లీ, నవంబర్ 28 (జనంసాక్షి) :
ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛ హరించేవారు వారి హక్కులు ఏం కాపాడుతారని కేంద్ర న్యాయశాఖ మంత్రి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై మండిపడ్డారు. గుజరాత్‌కు చెందిన ఒక మహిళపై నిఘా పెట్టి, ఆమె వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నానని ప్రకటించిన మోడీ ఇక దేశ ప్రజల హక్కులను ఏం కాపాడగలని ఆయన ప్రశ్నించారు. దేశానికి అభివృద్ధి నమూనా గుజరాత్ అని ప్రకటిస్తున్న మోడీ ఆ అభివృద్ధి ఫలాలు ఎవరికి అందుతున్నాయో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కార్పొరేట్ శక్తుల అభివృద్ధిని ప్రజల అభివృద్ధి ప్రచారం చేసుకోవడం మినహా మోడీ చేసిందేమీ లేదన్నారు. గుజరాత్‌లో కనీసం ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా మోడీ చేశారని అన్నారు. ఆయన ప్రధాని అయితే దేశ ప్రజలందరికీ అదే దుస్థితి దాపురిస్తుందన్నారు. గుజరాత్‌లో జరిగింది అసలు అభివృద్ధే కాదన్నారు. అక్కడి ప్రజల హక్కులను కాలరాసిన కార్పొరేట్ కంపెనీలు మోడీ ప్రచారానికి నిధులు పంపుతున్నాయని ఆరోపించారు. తెహెల్కా తరుణ్ తేజ్‌పాల్ లైంగిక వేధింపుల వివాదం కేంద్రమంత్రి కపిల్ సిబాల్, భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్‌ల మధ్య వివాదానికి దారి తీసింది. తేజ్‌పాల్‌ను ఓ కేంద్రమంత్రి కాపాడుతున్నారని సుష్మా స్వరాజ్ రెండు రోజుల క్రితం విమర్శించారు. అయితే సుష్మా సిబాల్ పేరు ప్రస్తావించలేదు. అయితే సుష్మా విమర్శలపై కేంద్రమంత్రి కపిల్ సిబాల్ స్పందించారు. తనకు తెహెల్కాలో ఎలాంటి వాటాలు లేవని, కేవలం ఐదు లక్షల రూపాయల విరాళాలు మాత్రం ఇచ్చినట్లు చెప్పారు. తేజ్‌పాల్‌ను రక్షించాల్సిన అవసరం తనకు లేదని ఆయన అభిప్రాయపడ్డారు.దీనిపై సుష్మా కౌంటర్ ఇచ్చారు. తాను ఓ కేంద్రమంత్రి కాపాడుతున్నారని మాత్రమే చెప్పానని, ఎవరి పేరును ప్రస్తావించలేదని గురువారం చెప్పారు. తాను చెప్పని దానికి సిబాల్‌ఎందుకు స్పందించారని అన్నారు. తనకు తెహెల్కాతో ఎలాంటి సంబంధం లేదన్న సిబాల్ ఖండనలో స్పష్టత లేదన్నారు. తేజ్‌పాల్ కేసులో తాను సిబాల్ పేరును చెప్పలేదన్నారు. ఇదిలావుంటే రాజీనామా చేసిన తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి ఇంటి ఎదుట బిజెపి నేత ఒకరు ఆందోళన చేశారు. ఆమె ఇంటి వద్ద ఉన్న నేమ్ బోర్డుపై పేరును చెరిపేసి అక్యూజ్డ్ అని రాశారు. పార్టీ కార్యకర్తలతో కలిసి సదరు నేత ఆందోళన చేపట్టారు. జాతీయ మహిళా కమిషన్‌కు వెళ్లడానికి బయటకు వచ్చిన షోమా చౌదరిని అడ్డుకొని నినాదాలు చేశారు.
వ్యక్తిగత స్వేచ్ఛ హరించేవారు




