Monday, 2 November 2026

ఏసీబీ డీజీగా ఏకే ఖాన్‌

హైదరాబాద్‌, నవంబర్‌ 28 (జనంసాక్షి) :
అవినీతి నిరోధక శాఖ డీజీగా ఏకే ఖాన్‌ నియమితులయ్యారు. ఇన్నాళ్లు ఆర్టీసీ ప్రగతి రథచక్రాలను నడిపించిన సారథి ఏకేఖాన్‌ను ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖ డీజీగా నియమించింది. 1981 బ్యాచ్‌కి చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన అబ్దుల్లా ఖయ్యూంఖాన్‌ గత కొంత కాలంగా ఆర్టీసీ ఎండీగా ఉంటూనే ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఆ పదవిలో బయ్యారపు ప్రసాదరావును డీజీపీగా నియమించినప్పటి నుంచి ఖాన్‌ జోడు పదవుల్లో ఉన్నారు. కాగా ఇప్పుడు ఆయనను పూర్తి స్థాయిలో ఏసీబీ డీజీగా నియమించారు. కాగా ఆయన స్థానంలో 1988 బ్యాచ్‌కి చెందిన మరో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి జె.పూర్ణచంద్రరావును ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌, ఎండీగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్‌ మొహంతి గరువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *