ముంబై, నవంబర్ 29 (జనంసాక్షి) :
భారత మాజీ క్రికెటర్ వినోద్‌కాంబ్లీ గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యాడు. వినోద్‌కాంబ్లీ తన ఇంటికి కారు డ్రైవ్ చేస్తూ వెళ్తుండగా మార్గమధ్యంలో గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో సమీపంలో ఉన్న ఒక పోలీసు అధికారి కాంబ్లీని లీలావతి హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. సమయానికి తీసుకురావడంతో కాంబ్లీ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. 42 ఏళ్ల కాంబ్లీకి గతంలో రెండుసార్లు సర్జరీలు జరిగాయి. 2000లో చివరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన కాంబ్లీ ఆ మరుసటి ఏడాదే ఫస్ట్‌క్లాస్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాంబ్లీ మొత్తం 17 టెస్టుల్లో 1084 పరుగులు చేశాడు. దీనిలో వరుసగా రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 104 వన్డేల్లో 2477 పరుగులు చేశాడు. స్కూల్ స్థాయిలో సచిన్ టెండూల్కర్‌తో కలిసి ప్రపంచ రికార్డ్ భాగస్వామ్యం నెలకొల్పిన కాంబ్లీ ప్రస్తుతం రియాల్టీ షోస్‌కు జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల ముంబైలో జరిగిన సచిన్ చివరి టెస్ట్ మ్యాచ్‌కు తనకు ఆహ్వానం అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
మాజీ క్రికెటర్ వినోద్‌కాంబ్లీకి గుండెపోటు




