న్యూఢిల్లీ, నవంబర్ 29 (జనంసాక్షి) :
లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఇరుక్కున్న న్యాయమూర్తికి ఏకే గంగూలీ అని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టులోని ఓ సీనియార్ న్యాయమూర్తి తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళా న్యాయవాది గతంలో పిర్యాదు చేశారు. ఆ కేసును విచారించిన త్రిసభ్య కమిటీ ఇప్పుడు ఆ న్యాయమూర్తి పేరును బయట పెట్టింది. కమిటీలో ఉన్న ముగ్గురు న్యాయమూర్తులు ఆరుసార్లు సమావేశమైన తర్వాత తమ నివేదికను గురువారం సమర్పించారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో ఒక న్యాయమూర్తిపై ఇలాంటి ఆరోపణలు వచ్చినపుడు పేరు బయట పెట్టడం స్వతంత్య్ర భారతదేశంలో ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివానికి నివేదిక సమర్పించారు. బాధిత న్యాయవాది వాంగ్ములం, పదవీ విరమణ చేసిన జస్టిస్ ఏకే గంగూలీ వాంగ్మూలం కూడా ఈ నివేదికలో ఉన్నాయి.
నాపై లైంగిక వేధింపుల ఆరోపణలు అబద్దం
తాను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తన వద్ద లా ఇంటర్న్ షిప్ చేసిన ఒక యువతి చేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎకె గంగూలి ఖండించారు. తనపై వచ్చిన ఆరోపణలతో దిగ్బ్రాంతికి, మనోవేదనకు గురయ్యానని శుక్రవారం ఆయన తెలిపారు. నాపై వచ్చిన ఆరోపణలన్నింటిని ఖండిస్తున్నాని ఆయన తెలిపారు. తనపై అలాంటి ఆరోపణలు ఎందుకు చేయవలసి వచ్చిందో అర్థం కావడం లేదు. అని జస్టిస్ గంగూలీ ఆవేదన వ్యక్తం చేశారు.
లైంగిక వేధింపు న్యాయమూర్తి ఏకే గంగూలీ




