న్యూఢిల్లీ, నవంబర్ 30 (జనంసాక్షి) :
జపాన్ రాజదంపతులు అఖిహిటో, మిషికో శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. వారు దేశంలో ఆరు రోజుల పాటు పర్యటిస్తారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న రాజదంపతులకు ప్రధాని మన్మోహన్‌సింగ్, ఆయన సతీమణి గురుశరణ్‌కౌర్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. జపాన్ ప్రధాని యోషిరోమోరీ సహా 50 మంది ప్రతినిధుల బృందం వారి వెంట భారత్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో ఎలాంటి రాజకీయ చర్చలకు తావు లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ వెల్లడించారు. అకిహిటో దంపతులు ఢిల్లీతో పాటు చెన్నైలోనూ పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. అకిహితో దంపతులు 1960 నవంబర్, డిసెంబర్ నెలల్లో హనీమూన్ కోసం భారత్‌కు విచ్చేశారు. 50 ఏళ్ల తర్వాత ఆ జంట మళ్లీ భారత్‌లో సరదాగా గడిపేందుకు వచ్చారు. వారు బీహార్‌లోని బోధ్ గయాను సందర్శిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. అకిహితో దంపతులు చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి డిసెంబర్ 5న తిరిగి టోక్యో బయల్దేరుతారని ఆయన పేర్కొన్నారు.
భారత్ చేరుకున్న జపాన్ రాజ దంపతులు





