Monday, 2 November 2026

న్యూయార్క్‌లో పట్టాలు తప్పిన రైలు

నలుగురు మృతి

న్యూయార్క్‌, డిసెంబర్‌ 1 (జనంసాక్షి) :

అమెరికాలో ఓ రైలు పట్టాలు తప్పింది. ఈప్రమాదంలో నలుగురు మృత్యువాతపడ్డారు. న్యూయార్క్‌లోని బ్రాంక్స్‌ ప్రాంతంలో ఆదివారం ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. ప్యాసింజర్‌ రైలులోని ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. పట్టాలకు సమీపంలోనే ఉన్న హడ్సన్‌ నది ఒడ్డు వరకు బోగీలు వెళ్లి ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని న్యూయార్క్‌ ట్రాన్స్‌పోర్టు అథారిటీ అధికారులు పేర్కొన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *