జీవోఎం ముసాయిదా రెడీ

పది జిల్లాల తెలంగాణ, రాయల తెలంగాణ
రెండు సిఫార్సులు
ఏదో ఒకటి ఫైనల్‌ చేయనున్న మేడం
నేడు కేబినెట్‌ ముందుకు తెలంగాణ
వెనువెంటనే రాష్ట్రపతికి
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 4 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై సంప్రదింపుల ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం తన ముసాయిదాను సిద్ధం చేసింది. హైదరాబాద్‌ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం, కర్నూల్‌, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సూచిస్తూ జీవోఎం ముసాయిదాలు వేర్వురుగా సిద్ధం చేసింది. ఈ రెండు నివేదికలు గురువారం నిర్వహించే కేబినెట్‌ భేటీ ముందుకు టేబుల్‌ నోట్‌గా రానున్నాయి. అంతకన్నా ముందే మంత్రుల బృందం రూపొందించిన నివేదికలు కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియగాంధీ పరిశీలన కోసం పంపిస్తారు. ఆమె రెండు ముసాయిదాలు పరిశీలించి ఏదో ఒకటి మాత్రమే ఫైనల్‌ చేస్తారు. ఆమె ఆమోదించిన ముసాయిదానే మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెడతారు. ఈ ముసాయిదాను కేంద్రమంత్రివర్గం ఆమోదించడం లాంఛనమే. మంత్రివర్గం ఆమోదం తెలిపిన వెంటనే తెలంగాణ ఏర్పాటు ముసాయిదా రాష్ట్రపతి పరిశీలనకు వెళ్తుంది. ఆయన దీనిపై ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ అభిప్రాయాన్ని కోరుతారు. దీనిపై ఆయన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ అభిప్రాయం కోసం ఏమైనా వ్యవధి కోరుతారా లేదా అన్నది తేలాల్సి ఉంది. అయితే ఈనెల 12 నుంచి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు నిర్ణయించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడంతో ఆ సమావేశాల్లో తెలంగాణ బిల్లు అసెంబ్లీ ముందుకు రానుంది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తయితే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పార్లమెంట్‌ ముందుకు వచ్చే అవకాశముంది. బుధవారం నార్త్‌ బ్లాక్‌లో సమావేశమైన మంత్రివర్గం తీవ్ర సంప్రదింపుల అనంతరం రెండు ముసాయిదాలకు ఆమోద ముద్ర వేసింది. తుది నిర్ణయాన్ని కాంగ్రెస్‌ అధినేత్రికే వదిలేసింది. కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) సభ్యుడు జైరామ్‌ రమేష్‌ ముందుగా కేంద్ర ¬ంశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆంధప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2013 (తెలంగాణ బిల్లు) ముసాయిదా న్యాయ శాఖ నుంచి ¬ంశాఖకు చేరింది. దీనిపై సాయంత్రం తీసుకునే నిర్ణయాలపై చర్చించారు. అధికారులు ముసాయిదా బిల్లుకు అధికారులు తుది మెరుగులు దిద్దారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ రాయల తెలంగాణపైనే మొగ్గు చూపుతున్న నేపధ్యంలో జిఓఎం సభ్యులు కూడా ఈ అంశంపైనే వాడివేడిగా చర్చించిన విషయం తెలిసిందే. రాయల తెలంగాణ తెరపైకి రావడంతో కొంత సంక్లిష్టత ఏర్పడింది. జైరాం మెరుగులు దిద్ది బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు జీవోఎం భేటీ అయ్యారు. తెలంగాణ బిల్లును సాధ్యమైనంత త్వరగా పార్లమెంటులో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని జీవోఎం సభ్యుడు కేంద్రమంత్రి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ మాజీ ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ అన్నారు. ఆయన కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు. ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లు సభకు వస్తుందా లేదా అనే విషయంపై ఇప్పుడే చెప్పలేమని బుధవారం అన్నారు. ఆయన కోల్‌కతాలో విలేకరులతో తెలంగాణ అంశంపై మాట్లాడారు. వీలైనంత త్వరగా పార్లమెంటుకు తెలంగాణ బిల్లు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. శీతాకాల సమావేశాల్లో వస్తుందని అప్పుడే చెప్పలేమన్నారు. తెలంగాణ ఏర్పాటుపై జివోఎం వేగంగా పని చేస్తోందని తెలిపారు. ప్రస్తుతం చర్చలు చివరి దశలో ఉన్నాయన్నారు. వీలైనంత త్వరగా పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఆజాద్‌ తెలిపారు. తెలంగాణ ఏర్పాటుపై జీవోఎం వేగంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.