Tuesday, 3 November 2026

బ్లాక్‌ డే సందర్భంగా పటిష్ఠ బందోబస్తు

హైదరాబాద్‌: బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు నిరసనగా ఈ రోజు బ్లాక్‌ డే పాటిస్తుండడంతో హైదరాబాదులో పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవావరం కావడంతో పాతబస్తీలో పటిష్ఠ నిఘా ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలతో పాటు ఇతర జిల్లాల పోలీసులు, ఏపీఎస్సీ ప్లటూన్లతో భద్రత చర్యలు చేపట్టారు. రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. వదంతులను నమ్మవద్దని, ఎలాంటటి సమాచారం ఉన్నా తమకు తెలపాలని పోలీసులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *