టీడీపీ, వైకాపాలకు డీకే అరుణ హితవు
హైదరాబాద్, డిసెంబర్ 6 (జనంసాక్షి) :
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్న తరుణంలో ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో ఆమె మీడియాతో మట్లాడారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్ర నేతలు సహకరించాలని ఆమె కోరారు. రాష్ట్రాలుగా విడిపోయి సన్నిహితుల్లా కలిసిమెలిసి ఉందామన్నారు. సీమాంధ్రలో ఆ పార్టీలు రెచ్చగొట్టే వ్యాఖ్యలవల్లే ఆందోళనలు ప్రారంభం అయ్యాయని, వాటిని నివారించాల్సినవసరం వారిపైనే ఉందన్నారు. పది జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి మంత్రి అరుణ ధన్యవాదాలు తెలిపారు. పది జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తెలంగాణ ప్రజలికిచ్చిన మాటను నిలుపుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు దాదాపు పూర్తయిందన్నారు. 2014 ఎన్నికలు రెండు రాష్ట్రాల్లోనే కొనసాగుతాయన్నారు. కొత్త సంవత్సరం వేడుకలను కచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలోనే నిర్వహించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇకనైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానండి




