Tuesday, 3 November 2026

విభజన ఆపండి

రాష్ట్రపతికి బాబు లేఖ
హైదరాబాద్‌, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ విభజనను ఆపాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి లేఖ రాశారు. కేంద్రం రాష్ట్ర విభజన విషయంలో చాలా అన్యాయంగా వ్యవహరించిందని, మెజార్టీ ప్రజలకు అన్యాయం చేసేలా వ్యవహరించింది కాబట్టి రాష్ట్రపతిగా మీరు జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం కనీస ప్రమాణాలు పాటించలేదని, ఆర్టికల్‌ 371(డి) కొనసాగింపుపై స్పష్టత లేదని, కనీసం అటార్నీ జనరల్‌ అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదని బాబు మండిపడ్డారు. కేవలం ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే రాష్ట్ర ప్రజల మధ్య కాంగ్రెస్‌ పార్టీ చిచ్చుపెట్టిందని ఆయన మండిపడ్డారు. నీళ్లు, హైదరాబాద్‌పై కేంద్రం పెత్తనం చెలాయించాలని చూస్తోందని, హైదరాబాద్‌పై రకరకాల వ్యాఖ్యలు చేశారు కానీ వేటిలోనూ స్పష్టత లేదని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *