మైలవరం: కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలోని వైకాపా నేతల మధ్య వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా వైకాపాలోని రెండు వర్గాలు వేర్వేరుగా చేపట్టిన ద్విచక్రవాహన ర్యాలీ వివాదానికి కారణమైంది. ఒకే సమయంలో నియోజక వర్గ సమన్వయ కర్తలు జేష్ఠ రమేశ్ బాబు, జోగి రమేశ్ వర్గీయులు ర్యాలీ ప్రారంభించారు.ప్రధాన కూడలిలో ఇరు వర్గాల ర్యాలీలు తారసపడ్డాయి. ఈ సందర్భంగా తీవ్ర వాగ్వాదం జరిగి ఒకరిపై ఇకరు కర్రలతో దాడి చేసుకున్నారు. సమాచారం అందుకున్న సీఐ, ఎన్.ఐ సిబ్బందితో వచ్చి ఇరువర్గాల వారిని చెదరగొట్టారు.




