Wednesday, 4 November 2026

ఘనంగా శిక్షణ పైలట్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

హైదరాబాద్‌: దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్సు అకాడమీలో ట్రైనీ పైలట్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ ఘనంగా జరిగింది. దీంతో శిక్షణ పూర్తి చేసుకున్న 202 మంది పైలట్లు వైమాన దళంలో అధికారికంగా చేరారు. వాయుసేనలో చేరుతున్న ట్రైనీ పైలట్ల పరేడ్‌ను వైమానిక దళ ప్రధానాధికారి ఎయిర్‌ చాఫ్‌ మార్షల్‌ ఎన్‌.ఎ.కె.బ్రౌనె వీక్షించారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారిలో 37 మంది మహిళలు ఉన్నారు. వీరందరికీ అత్యాధునిక శిక్షణ విమానం పిలేటన్‌పై శిక్షణ ఇచ్చామని వాయుసేన అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి పిలేటన్‌ సిమ్యులేటర్‌ పై కూడా శిక్షణ ఇస్తామని బ్రౌనె పేర్కొన్నారు. పరేడ్‌ సందర్భంగా సారంగ్‌ హెలికాప్టర్ల బృందం ప్రదర్శించిన విన్యాసాలు వీక్షకులకు విశేషంగా ఆకట్టుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *