హైదరాబాద్, డిసెంబర్ 14 (జనంసాక్షి) :
ఉద్యోగులకు 45 శాతం నుంచి 50 శాతం వరకు మధ్యంతర భృతి ఇవ్వాలని టీఎన్‌జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్ కోరారు. శనివారం సచివాలయంలో ఐఆర్‌పై ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు నిర్వహించింది. ఈ చర్చలకు హాజరైన టీఎన్‌జీవో, టీజీవో తదితర ఉద్యోగ సంఘాల నేతలు పీఆర్సీ అమలు ఏడాది ఆలస్యమైనందున వెంటనే మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, కొండ్రు మురళి, ఉత్తమకుమార్ రెడ్డి ఉద్యోగులతో చర్చలకు హాజరయ్యారు. ఐఆర్‌పై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రులు హాజరయ్యారు. అనంతరం దేవిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం దాటవేయాలని చూస్తే త్వరలోనే భవిష్యత్ కార్చాచరణ ప్రకటిస్తామని అన్నారు. టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇకపై ఉద్యోగులతో చర్చలు జరిపేటపుడు తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులను వేర్వేరుగా ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రవీందర్‌రెడ్డి, విఠల్ తదితరులు పాల్గొన్నారు.
మధ్యంతర భృతి ఇవ్వండి : దేవీప్రసాద్




