పార్లమెంట్‌లో ఇదే ఐక్యత చాటాలి : కోదండరామ్
హైదరాబాద్, డిసెంబర్ 16 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు శాసనసభ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. స్పీకర్ మనోహర్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన టీ జేఏసీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నేతలు అసెంబ్లీలో చూపించిన ఐకమత్యం పార్లమెంట్‌లోనూ చూపించాలని ఆయన కోరారు. పార్లమెంట్ తెలంగాణ బిల్లును ఆమోదించేలా అన్ని పార్టీల నేతలు ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు సూచనలతో తయారైన నోట్‌ను సభ్యులకు ఇస్తామన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో శాసనసభ, మండలి ముందుకు ముసాయిదాలు చర్చకు రావడంఒక ముందడుగని అన్నారు.





