పలువురు ప్రముఖుల నివాళి
హైదరాబాద్, డిసెంబర్ 16 (జనంసాక్షి) :
టీఆర్‌ఎస్ జాతీయ కార్యదర్శి కె.కేశవరావుకు సతీ వియోగం కలిగింది. ఆయన సతీమణి వసంతకుమారి (70) సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆమె మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు కేకే నివాసానికి చేరుకొని ఆయనును పరామర్శించారు. వసంతకుమారి మృతదేహానికి ఘన నివాళులర్పించారు. టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. జానారెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీశ్‌రావు, కేటీఆర్, వివిధ పార్టీల నేతలు కేకేను ఓదార్చారు.





