Tuesday, 3 November 2026

రాహులే ప్రధాని : లాలూ

రాంచీ, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాన మంత్రి అభ్యర్థిత్వానికి రాష్ట్రీయ జనతాదళ్‌ అధ్యక్షుడు లాలూప్రసాద్‌ యాదవ్‌ ఆమోదం తెలిపారు. కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను ప్రకటించకున్నా ఆయనకు లాలూ మద్దతు తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తన ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ గాంధీని ప్రకటిస్తే మద్దతిస్తానని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌ యాదవ్‌ తెలిపారు. అయితే ఎన్నికల అనంతర యూపీఏ పక్షాలు ఈ అంశంపై చర్చించాల్సిన అవసరం వుందన్నారు. ధానా కుంభకోణంలో అరెస్టయిన లాలుకు సుప్రీం కోర్టు బెయిల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *