Wednesday, 4 November 2026

యథాతథంగా వడ్డీరేట్లు

ఆశ్చర్య పరిచిన ఆర్‌బీఐ
ముంబయి, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) :

కీలక వడ్డీరేట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ యథాతథంగా ఉంచింది. రిజర్వు బ్యాంకు ఇవాళ ఉదయం ప్రకటించిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష మార్కెట్లను ఆశ్చర్యపరిచింది. ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచుతుందని భావిస్తున్న తరుణంలో ఎలాంటి మార్పు లేకుండా యధాతథంగా ఉంచడంతో మార్కెట్లు ఉత్సాహం పుంజుకున్నాయి. దీంతో రెపో రేటు 7.75 శాతం వద్దే కొనసాగుతుంది. వడ్డీ రేట్లను పెంచడం లేదన్న వార్తలు వెలువడిన వెంటనే భారత స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. కీలక వడ్డీరేట్లు, రెపో రేటు, రివర్స్‌ రెపోరేటు, నగదు నిల్వల నిష్పత్తిని యథాతథంగా ఉంచుతూ భారతీయ రిజర్వ్‌ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన ద్రవ్య పరపతి సమీక్ష అనంతరం ఈ నిర్ణయాలు వెలువడ్డాయి. ఇప్పటి వరకూ రెపోరేటు 7.75 శాతం, రివర్స్‌ రెపోరేటు 6.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి 4 శాతంగా ఉండగా తదుపరి ద్రవ్య పరిమితి సమీక్ష వరకూ ఈ పరిస్ధితినే కొనసాగించనుంది. కీలక కడ్డీరేట్లను కూడా మార్చలేదు. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిన్పటికీ ఈ సమీక్షలో ఎలాంటి మార్పలూ జరగకపోవడం వాణిజ్య పారిశ్రామిక వర్గాలు ఆశ్చర్యానికి లోనయ్యాయి. ద్రవ్యోల్బణం పెరిగినా ధరల నియంత్రణకు చర్యలు చేపట్టినట్టు ఆర్బీఐ ప్రకటన పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *