ముజాఫర్‌నగర్ బాధితులకు రాహుల్ పరామర్శ
ముజాఫర్ నగర్, డిసెంబర్ 22 (జనంసాక్షి):
మేమున్నాం అధైర్య పడొద్దని రాహుల్ గాంధీ ముజాఫర్ నగర అల్లర్ల బాధితులకు రాహుల్ గాంధీ భరోసా నిచ్చాడు. ఆదివారం కాంగ్రె స్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్‌లోని ముజాఫర్ నగర్ అల్లర్ల భాధితులను పరామర్శించా రు. పునరావాస కేంద్రాలలో ఉంటు న్న బాధితులను పరామర్శించి వారిని స్వగృహాలకు తిరిగి వెళ్లాల్సిం దిగా కోరారు. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి ఆర్‌పీఎస్ సింగ్ ,ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూ దన్ మిస్త్రీ తదితరులు రాహుల్ వెం ట ఉన్నారు. ఈ పర్యటన సందర్భం గా పలవురు బాధితులు రాహుల్ తో మాట్లాడుతూ తాము గ్రామాలకు తిరిగి వెళితే మళ్లీ దాడులు జరిగే ప్ర మాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముజాఫర్ నగర్‌లో ఈ సె ప్టెంబర్‌లో జరిగిన అల్లర్లలో సుమారు 60 మంది ప్రాణాలు కోల్పోయారు.
మేమున్నాం అధైర్య పడొద్దు




