Tuesday, 3 November 2026

చిగురించిన శాంతి

భారత్‌-పాక్‌ల డీజీఎంవోల కీలక భేటీ
కార్గిల్‌ తర్వాత మొదటి సమావేశం
కాల్పుల విరమణకు అంగీకారం
సరిహద్దులో సాధారణ పరిస్థితులకు సహకారం
శ్రీనగర్‌, డిసెంబర్‌ 24 (జనంసాక్షి) :
భారత్‌-పాకిస్తాన్‌ మధ్య మళ్లీ శాంతి చిగురిస్తోంది. ఇరు దేశాలకు చెందిన ఆర్మీ డీజీఎంవోలు మేజర్‌ జనరల్‌ అమర్‌ రియాజ్‌ (పాకిస్తాన్‌), లెఫ్టినెంట్‌ జనరల్‌ వినోద్‌ భాటియా (భారత్‌) భేటీ అయ్యారు. వాగ్దా-అట్టారి సరిహద్దు జరిగిన సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చించారు. కార్గిల్‌ యుద్ధం తర్వాత ఇరు దేశాల డీజీఎంవోల భేటీ జరగడం ఇదే మొదటిసారి. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించాలని, సరిహద్దులో సాధారణ పరిస్థితుల కల్పనకు సహకరించాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *