Tuesday, 3 November 2026

ఏ పార్టీకెంతభూమిచ్చారు?

లెక్కలు చెప్పండి
సర్కారుకు హైకోర్టు హుకుం
హైదరాబాద్‌, డిసెంబర్‌ 24 (జనంసాక్షి) :
ఏ రాజకీయ పార్టీకి ఎంత భూమి ఇచ్చారో లెక్కలు చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి హుకుం జారీ చేసింది. పార్టీలకు భూకేటాయింపులపై రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. భూకేటాయింపులపై వివరణ ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అలాగే భూ కేటాయింపులు ఎలా చేశారో వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని అదేశించింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఈ రోజు కోర్టుకు హాజరై నివేదిక సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *