శనివారమే పట్టాభిషేకం
రాంలీల మైదానమే వేదిక
ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ,డిసెంబర్25(జనంసాక్షి): ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అరవింద్ కేజీవ్రాల్ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రామ్‌లీలా మైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు కాగానే అన్నా హజారేని ఆహ్వానిస్తామని అరవింద్ కేజీవ్రాల్ ఇంతకు ముందే స్పష్టం చేశారు. నిజానికి గురువారం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని భావించారు. అయితే శనివారానికి మార్చారు. అన్నా, కిరణ్‌బేడీ, సంతోష్ హెగ్డే తదితరులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పిన్నవయస్కులైన మంత్రి వర్గ సహచరులతో ఢిల్లీకి పిన్న వయసు ముఖ్యమంత్రిగా అరవింద్ కేజీవ్రాల్ చరిత్ర సృష్టించనున్నారు. వీఐపీ సంస్కృతికి వ్యతిరేకంగా ఇప్పటికే ఆప్ తీసుకున్న నిర్ణయాలు చర్చనీయాంశాలయ్యాయి. కాంగ్రెస్ మద్దతు గురించి జరుగుతున్న ఊగిసలాట విషయమై అరవింద్ కేజీవ్రాల్ బుధవారం ఉదయం జనతా దర్బారులో మాట్లాడుతూ తాము సమస్యల విూద దృష్టి పెడుతున్నామని, మద్దతు విూద కాదని పేర్కొన్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుపై లెప్టినెంట్ గవర్నర్ ప్రతిపాదనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంగీకరించారు. ప్రభుత్వం ఏర్పాటుకు రాష్ట్రపతి అంగీకరించినట్లు కేంద్ర ¬ంశాఖ ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్‌కు తెలిపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఎప్పుడన్నది లెప్టినెంట్ గవర్నర్ నిర్ణయిస్తారని ¬ంశాఖ పేర్కొంది. సాంకేతిక కారణాల వల్ల తమ ప్రభుత్వం ప్రమాణస్వీకార కార్యక్రమం గురువారం ఉండకపోవచ్చని అరవింద్ కేజీవ్రాల్ బుధవారం చెప్పారు. ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నుంచి ఇప్పటివరకు తమకు ఎలాంటి సమాచారం రాలేదని ఆయన పేర్కొన్నారు. ప్రమాణస్వీకారానికి తేదీ ఖరారయ్యాక అన్నా హజారేని ఆహ్వానిస్తామని అరవింద్ తెలిపారు. కాంగ్రెస్ మద్దతుపై ఆ పార్టీలో వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాల నేపథ్యంలో కేజీవ్రాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. మద్దతివ్వాలా వద్దా అనేది ఆ పార్టీ ఇష్టమని, తొలుత వారు బేషరతు మద్దతు ఇస్తామని తెలిపారని ఆయన పేర్కొన్నారు. తాము మాత్రం విషయ ప్రధానంగా ప్రభుత్వం నడపాలనుకుంటున్నామని, ఎన్నికల ముందు చెప్పినట్లుగా తమ మేనిఫెస్టోలోని అంశాలు అమలుచేసే విషయంపై పని ప్రారంభించామని కేజీవ్రాల్ తెలిపారు. తరవాత లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి సమాచారం రావడంతో ప్రమాణస్వీకారాన్ని శనివారం ఏర్పాటు చేశారు.
ఢీల్లీ పీఠంపై సామాన్యుడు




