Tuesday, 3 November 2026

సవరణల కోసం పోరు : కోదండరాం

హైదరాబాద్‌ డిసెంబర్‌ (జనంసాక్షి) :రాష్ట్ర పునర్విభజన బిల్లులో తెలంగాణకు సంబంధించిన సవరణలు ఎత్తిచూపేందుకే జనవరి 6లేదా 7న ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం వెల్లడించారు. దీనికి సంబంధించి జేఏసీ భాగస్వామ్య పక్షాలతో తాను మాట్లాడుతున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల పరిపూర్తికే సవరణలు చేయాలని తాము డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన తెలంగాణ ఆగదని 2014 సంవత్సరంలో తెలంగాణ సంవత్సరంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. అలాగే తెలంగాణ పునర్‌నిర్మాణ కార్యచరణ సాగుతుందని ఆయన తెలిపారు. బిల్లులో తెలంగాణ ఆకాంక్షల పరిపూర్తికి సవరణలు జరగాలన్న ఆయన హైకోర్టు విభజన వెంటనే అవసరం లేదని ,ఉద్యోగుల స్థానికత గోదావరిపై బోర్డు అవసరం లేదన్న అభిప్రాయం తెలంగాణ కరెంటు పంపిణీలో హేతుబద్దత ,ఆస్తులు ,అప్పుల పంపిణీలో మార్పులు ,ఏపీ భవన్‌ తెలంగాణ ఆస్తిగా ఉంచాలన్నా అంశాలపై సవరణలు ప్రతిపాదనలు పంపాలనుకుంటున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ , బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మినారాయణ, టీఎన్‌జీవోల అధ్యక్షుడు దేవిప్రసాద్‌, ఎమ్మెల్సీ
స్వామిగౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, అద్దంకి దయాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *