వాటికన్ డిసెంబర్ 25(జనంసాక్షి) వాటికన్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.పోప్ అశేష క్రైస్తవులను ఉద్దేశించి ప్రసంగించారు. పపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తమ జీవితాల్లో శాంతి నెలకొల్పేందుకు దైవకుమారుడు పుట్టాడని కోట్లాదిమంది క్రైస్తవులు వివిధ చర్చిలు కూటముల ద్వారా ప్రార్ధనలు రూపంలో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటా వెలుగులు విరజిమ్మే తారల మధ్య చిన్నారులందరికి క్రిస్మస్ తాతయ్య శాంతాక్లాజ్ కానుకలందిస్తుండగా హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ అంటూ కేకలు కట్ చేసి అందరినోటా తీపి చేసుకుంటున్నారు. క్రిస్మస్ ట్రీ ఈ సారి ఏం కానుకలు ఇస్తుందోనని పిల్లలు వారి వెనుక పెద్దలు ఉత్సాహంగా పరుగులు తీస్తున్నారు. మరోపక్క ముద్దులొలికే బాల ఏసు జన్మదినాన్ని పలు స్వచ్చంద సంస్థలు అనాధశమ్రాలు , వృద్దాశ్రమాలలో ఘనంగా నిర్వహించాయి. దుస్తుల పంపిణీ , అన్నదానం తదితర కార్యక్రమాలు చేపట్టాయి. ప్రపంచ క్రైస్తవుల అత్యున్నత అధ్యాత్మిక గురువైన వాటికన్లోని పోప్ ప్రాన్సిన్ తన సందేశమిస్తూ భగవంతునితో పాటు మానవాళీ అంతటిని సోదర సోదరీమణులుగా భావించే ప్రేమించాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో వందల ఏళ్ల చరిత్ర ఉన్న గోవాలోని కతీడ్రల్ చర్చి ,బాసిలికా ఆఫ్ బామ్ చర్చీ ,కేరళ రాష్ట్రంలోని మన్నార్లో ఉన్న పారుమల చర్చి, మలయటూర్ చర్చి కొచ్చిన్లోని శాంతాక్రాజ్ చర్చి, వల్లార్ పాదం జార్జ్ ఫోర్టియాలోని సెయింట్ మెరీస్ చర్చివంటి చారిత్రక ప్రార్ధనాలయాల్లో విశేష ప్రార్ధనలు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని వివిధ స్కూళ్లలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. క్రీస్తు జననం మొదలుకొని ఆయన జీవితం పర్యంతం చూపిన ప్రేమను నాటక రూపంలో ప్రదర్శించి ఆ మహానియుని త్యాగాన్ని చాటి చెప్పారు. పాఠశాల విద్యార్థులు దేవదూతలుగా ,క్రిస్మస్ తాతా శాంతాక్లాజ్ వేషాలలో అలరించారు. ఈ సందర్బంగా చిన్నారులందరికి జింగిల్బెల్స్ అందజేశారు. కార్యక్రమాల్లో భాగంగా క్రీస్తు దివ్యత్వాన్ని తెలియజేసే కీర్తనలు ఆలపించారు. శిలువ ఊరేగింపులు నిర్వహించి పరవశించారు.రాష్ట్రంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకే శిలువ ఊరేగింపుతో క్రిస్మస్ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడి వేడుకల్లో పాల్గొనేందుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. విజయవాడ దగ్గరున్న గుణదల మేరిమాతా ఆలయంలోనూ ఏసు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు




