Tuesday, 3 November 2026

ఇక ఒకే మాట.. ఒకే బాట

ఉమ్మడిగా ముందుకు : కోదండరామ్‌
హైదరాబాద్‌, డిసెంబర్‌ 26 (జనంసాక్షి) :
ఇకపై ఒకే మాట.. ఒకే బాటగా ఉమ్మడిగా ముందుకు సాగుతామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తెలిపారు. జనవరిలో అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే తెలంగాణ రాజకీయా పార్టీలతో మంతనాలు జరిపి అసెంబ్లీ వ్యూహం ఖరారు చేసేందుకు జేఏసీ ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సీమాంధ్ర నేతలు ఒక్కటవుతున్న నేపథ్యంలో తాము కూడా కలసి చర్చించుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందుకు జెఎసి ముందుండి అందరినీ కలుపుకుని పోతుందన్నారు. పార్టీల పరంగా ఎన్ని విభేదాలు ఉన్నా అంతా కలసి నడవడం ద్వారా విభజన బిల్లుకు గట్టిగా మద్దతు తెలిపి అసెంబ్లీలో చర్చ జరిగేలా చూడాలని కోరాలని నిర్ణయించారు. ఇటీవలి సామావేశాలో నేతలంతా ఉమ్మడిగా పనిచేయడంపై జెఎసి సంతృప్తి వ్యక్తం చేస్తోంది. అయితే తెలంగాణ కల సాకారం అయ్యే వరకు తెలంగాణ నేతలు పరస్పరం విమర్శలు చేసుకోకుండా చూడాలని కోరనున్నారు. మరోవైపు జనవరి మొదటివారంలో ఉద్యమ నగారా మోగించేందుకు టీ జేఏసీ సిద్ధమవుతోంది. వేచిచూసే విధానానికి స్వస్తి పలికి సభలు, సమావేశాలు, ధర్నాలు, మహాధర్నాలతో మరోసారి తెలంగాణ ఆకాంక్షను మార్మోగించాలని నిర్ణయించింది. ఆంక్షలు, పరిమితులు లేని సంపూర్ణ తెలంగాణ డిమాండ్‌ తెలంగాణ పల్లె నుండి ఢిల్లీ దాకా వినిపించాలని జేఏసీ నాయకుల ఆలోచనగా ఉంది. ఆంక్షల కారణంగా తెలంగాణ నష్టపోతుందని ఇప్పటికే కెసిఆర్‌ పలుమార్లు చర్చించారు. తాజాగా ఆయన జానారెడ్డితో కలసి చర్చించారు. ఇక నుంచి కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌లే కాకుండా అంతా ఒక్కటై నడిచేలా కృషి చేయాలని నిర్ణయించారు. ఈ కార్యాచరణలో ఢిల్లీ పర్యటనలు, తెలంగాణకు మద్దతు ఇస్తున్న వివిధ జాతీయ రాజకీయ పక్షాలతో సంప్రదింపులు భాగంగా ఉన్నాయి. ఈ మేరకు 27 లేదా 2 తేదీలలో టీ జేఏసీ విస్తృత స్థాయి భేటీ జరుపనున్నారు. ఒకవైపున సైద్ధాంతిక చర్చ, మరోవైపున క్షేత్రస్థాయి ఉద్యమాలు, ఢిల్లీ స్థాయిలో జాతీయ స్థాయి పార్టీల నేతలతో సంప్రదింపులు అనే త్రిముఖ వ్యూహంతో ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లులో బిల్లు ఆమోదం పొందిన తర్వాత 45 రోజులలో సీమాంధ్ర ప్రాంత రాజధానిపైన తుది నిర్ణయం జరుగనున్నదని పేర్కొన్నందున, ఎలాంటి ఆలస్యం లేకుండా ఎంపిక జరుగాలని టీ- జేఏసీ డిమాండ్‌ చేస్తోంది. ఉమ్మడి రాజధాని రాజ్యాంగ విరుద్ధమన్న వాదనలు రెండు ప్రాంతాల నుండి వినిపించడం, ఆధునిక సాంకేతిక పరిజానంతో రెండు సంవత్సరాలలో సంపూర్ణ హంగులతో రాజధానిని నిర్మించుకునేందుకు అవకాశాలు ఉండటం వంటి కారణాలను తెలియచేస్తూ రెండు సంవత్సరాల కన్నా ఎక్కువగా హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ససేమిరా అంగీకరించేది లేదని జేఏసీ విస్పష్టంగా ప్రకటిస్తోంది.ఇక ముసాయిదా బిల్లునకు చేయాల్సిన సవరణలను, ప్రతిపాదనలను, అందుకు కారణాలను సోదాహరణంగా వివరిస్తూ ప్రత్యేకంగా ఒక నోట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ నోట్‌ను జాతీయ స్థాయిలో తెలంగాణ డిమాండ్‌ను సమర్థిస్తున్న రాజకీయ పార్టీల అధ్యక్షులకు, లోకసభ, రాజ్యసభలలోని పార్టీల సభా నాయకులకు అంద చేయాలని నిర్ణయించారుదేశంలోని మిగిలిన రాష్ట్రాలలాగే తెలంగాణకు సర్వహక్కులు, సంపూర్ణ రాష్ట్ర ¬దా దక్కాలనే నినాదంతో ప్రజలను సమాయత్త పరిచే వ్యూహరచన వేగంగా జరుగుతోంది. ఉద్యమ తేదీల ఖరారు అంశం చర్చల్లో ఉండగానే జనవరి 6న ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా జరపాలని భావించారు. అయితే గురువారం రాష్ట్రపతితో అపాయింట్‌మెంట్‌కు అవకాశముండడంతో అక్కడ సంప్రదింపులు జరిపిన తర్వాత జేఏసీ సమావేశం నిర్వహించి పరిస్థితి అంచనా వేసుకున్నాక మహాధర్నా తేదీని ప్రకటించనున్నారు. ఉద్యోగుల విభజన స్థానికత ఆధారంగా జరగాలనే డిమాండ్‌కు జీవో 36, జీవో 610, గిర్‌గ్లానీ రిపోర్ట్‌, తెలంగాణ రాష్ట్రానికి భారం కానున్న హైదరాబాద్‌లోని లక్షమంది సీమాంధ్ర రిటైర్డ్‌ ఉద్యోగుల అంశాన్ని జోడించి సీమాంధ్రులు సీమాంధ్ర ప్రభుత్వంలోనే పనిచేయాలన్న ప్రతిపాదన, డిమాండ్‌లను జాతీయ నాయకులకు ఇచ్చే నోట్‌లో వివరించనున్నట్లు కోదండరామ్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *