Tuesday, 3 November 2026

తెలంగాణకు ప్రత్యేక పీసీసీ

సీమాంధ్రలోనూ పర్యటిస్తా
జేసీకి షోకాజిచ్చాం : దిగ్విజయ్‌సింగ్‌
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 26 (జనంసాక్షి) :
తెలంగాణకు ప్రత్యేక పీసీసీ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. తెలంగాణలోనే కాదు తాను సీమాంధ్ర ప్రాంతంలోనూ పర్యటిస్తానని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన జేసీ దివాకర్‌రెడ్డికి షోకాజ్‌ నోటీసిచ్చామని ఆయన స్పష్టం చేశారు. జేసీ వివరణ ఇచ్చిన తర్వాత దానినిబట్టి తదుపరి చర్యలు చేపడతామన్నారు. ఇదిలావుంటే షోకాజ్‌ నోటీస్‌ అందిన తరవాత స్పందిస్తానని జెసి దివాకర్‌ రెడ్డి హైదరాబాద్‌లో చెప్పారు. తనపై చర్య తసీఉకునే దమ్ము బొత్సకు లేదని మండిపడ్డారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం కన్నా అధినేత్రిని ఎదరించి మాట్లాడినందుకే ఈ చర్యలకు సిద్దం అయ్యారని తెలుస్తోంది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే జేసీ దివాకర్‌రెడ్డికి నోటీసులు ఇచ్చామని దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. అతనిపై చర్యకు పిసిసి చీఫ్‌ బొత్స ఎప్పటినుంచో పట్టుబడుతున్నారు. గురువారం న్యూఢిల్లీలో దిగ్విజయ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంతంలో పర్యటించడానికి తనకేమి అభ్యంతరం లేదని తెలిపారు. సాధ్యమైనంత త్వరలో సీమాంధ్రలో పర్యటిస్తానని చెప్పారు. అయితే జనవరిలో విశాఖ నగరంలో పర్యటిస్తానని వెల్లడించారు. రాష్ట్ర విభజన విషయంలో సీఎం కిరణ్‌ కాంగ్రెస్‌ అధిష్టానానికి వ్యతిరేకంగా స్వరం పెంచుతున్నారని విలేకర్లు దిగ్విజయ్‌ సింగ్‌ను ప్రశ్నించగా ఆంధప్రదేశ్‌ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎప్పుడు సోనియాకు వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపారు. త్వరలోనే ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేస్తామని దిగ్విజయ్‌ సింగ్‌ వివరించారు. జేసీ నుంచి వివరణ వచ్చాక చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ పరంగా ప్రాంతీయ కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. త్వరలో సీమాంధ్రలోని విశాఖ, ఇతర ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు దిగ్విజయ్‌ చెప్పారు. తాను ఎప్పుడూ ఎవరికి భయపడలేదని, త్వరలో సీమాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తానని అన్నారు. ఆతాను జనవరిలో విశాఖపట్నం సహా సీమాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు.ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎప్పుడూ సోనియాకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు సోనియా గాంధీని విమర్శించినట్లుగా తన దృష్టికి ఎప్పుడు రాలేదన్నారు. ఒకవేళ ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వారి పేర్లు చెప్పాలన్నారు. ఆంధప్రదేశ్‌లో త్వరలో తాము ప్రాంతీయ కమిటీలు వేస్తామని చెప్పారు. కాగా, తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు పార్టీ మేనిఫెస్టోలోనే పెట్టిందని, అప్పుడే తమ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రాంత నేతలు అంగీకరించారని, ఎన్నికలకు ముందే రాష్ట్రం ఏర్పడుతుందని భావిస్తున్నానని డిగ్గీ మంగళవారం చెప్పిన విషయం తెలిసిందే. సీమాంధ్ర నేతలు రాష్ట్రపతికి అఫిడవిట్‌ ఇచ్చే బదులు అసెంబ్లీలో జరిగే తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చిస్తే బాగుంటుందని సూచించారు. అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాయని వివరించారు. కాంగ్రెసు పార్టీ రాజకీయాలను పరిపాలనతో ముడిపెట్టదన్నారు. తెలంగాణపై గతంలో అన్ని పార్టీలు వాగ్దానం చేశాయని చెప్పారు. ఇప్పుడు కొన్ని పార్టీలు వెనక్కి వెళ్లినా తాము విభజనకే కట్టుబడి ఉన్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి విలీనానికి, రాష్ట్ర ఏర్పాటుకు సంబంధం లేదన్నారు. ఇదిలావుంటే ఎన్నికల లోపే తెలంగాణ ఏర్పాటు చేస్తామని దిగ్విజయ్‌ హావిూ ఇచ్చారని మాజీమంత్రి షబ్బీర్‌ అలీ చెప్పారు. తెలంగాణ ఏర్పాటు అననుకున్నట్లుగానే పూర్తి చేస్తారన్నారు. సోనియా హావిూ ఇచ్చిన మేరకు తెలంగాణ ఏర్పాటు సకాలంలో పూర్తవుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *