Tuesday, 3 November 2026

మోడీకి క్లీన్‌చీట్‌పై నేను అధైర్య పడను

న్యాయం కోసం సుప్రీంకు వెళ్తా : జకియా జాఫ్రిన్‌
అహ్మదాబాద్‌, డిసెంబర్‌ 26 (జనంసాక్షి) :
గుజరాత్‌ నరమేధం కేసులో మోడీకి అహ్మదాబాద్‌ హైకోర్టు క్లీచ్‌చీట్‌ ఇవ్వడంపై సుప్రీం కోర్టుకు వెళ్తానని జకియా జాఫ్రిన్‌ వెళ్లడించారు. గురువారం ఆమె భర్త, మాజీ కాంగ్రెస్‌ ఎంపీ ఇషాన్‌ జఫ్రీ హత్యోదంతంపై అహ్మదాబాద్‌ కోర్టు సిట్‌ తీర్పును సమర్థించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. హైకోర్టులో న్యాయం జరుగలేదని, సుప్రీంలో న్యాయపోరాటం చేస్తానని ఆమె వెల్లడించారు. కాగా కోర్టు గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి 2002 గోద్రా అల్లర్లకేసులో క్లీన్‌చిట్‌ ఇచ్చింది. బాధితురాలు జకియా జాఫ్రీ అభ్యర్థనను తిరస్కరించిన అహ్మదాబాద్‌ కోర్టు సిట్‌ నివేదికను సమర్థించింది. అల్లర్ల కేసులో మోడీకి సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ జాఫ్రీ అహ్మదాబాద్‌ కోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 28, 2002న జరిగిన అల్లర్లలో మరణించిన 68 మందిలో కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఎహసాన్‌ జాఫ్రీ ఒకరు. ఆయన భార్య జకియా జాఫ్రీ ఈ కేసు వేశారు. అయితే తనకు న్యాయం జరిగేవరకు పోరాడతానని జకియా జాఫ్రి అన్నారు. అహ్మదాబాద్‌ కోర్టు గురువారం ఆమె పిటిషన్‌ను తిరస్కరించి మోడీకి క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై జకియా స్పందించారు. అహ్మదాబాద్‌ కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్తానని, ఉన్నత న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని ఆమె చెప్పారు. గోద్రా అల్లర్ల ఘటనపై మోడీకి స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌(సిట్‌) క్లీన్‌ చిట్‌ ఇవ్వడంపై జకియా జాఫ్రీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ రోజు తీర్పును వెలువరించింది. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు మోడీకి, బిజెపికి ఈ తీర్పు పెద్ద ఊరట అని చెప్పవచ్చు. ఈ తీర్పు కోసం దేశవ్యాప్తంగా అందరూ ఉత్కంఠతో ఎదురు చూశారు.కాగా, 2002 అల్లర్ల ఘటన సమయంలో మృతి చెందిన ఇషాన్‌ జాఫ్రి సతీమణి జకియా జాఫ్రి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, మరో 59 మంది పైన కోర్టు గడప తొక్కింది. సీనియర్‌ మంత్రులు, అధికారులు, పోలీసులతో కలిసి మోడీ రాష్ట్రంలో మత ఘర్షణల కుట్రకు పాల్పడ్డారని జకియా ఆరోపిస్తున్నారు. 28 ఫిబ్రవరి 2002న జరిగిన అల్లర్ల ఘటనలో నాటి కాంగ్రెసు పార్టీ పార్లమెంటు- సభ్యుడు ఇషాన్‌ జాఫ్రీ సహా 68 మంది మృతి చెందారు. అల్లర్ల సమయంలో జాఫ్రీ ఫోన్‌ చేసి సహకారం కోరినప్పటికీ పోలీసు అధికారుల నుండి స్పందన రాలేదని ఆరోపణలు ఉన్నాయి. మోడీని సిట్‌ 2010లో గోద్రా అల్లర్ల కేసులో విచారించింది. ఇదిలావుంటే తనపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని సిట్‌ అధిపతి ఆర్‌కె రాఘవన్‌ తెలిపారు. కేంద్ర ¬ంశాఖ, గుజరాత్‌ ప్రభుత్వం నుంచి తమకు పూర్తి మద్దతు లభించిందన్నారు. సిట్‌ పనితీరును కోర్టు అభినందించడం సంతోషకరమని రాఘవన్‌ వ్యాఖ్యానించారు. అంతకుముందు గోద్రా అల్లర్లపై స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీ-మ్‌(సిట్‌) విచారణ చేపట్టింది. 2008 మార్చి 8వ తేదీన సుప్రీం కోర్టు సిట్‌ను నియమించింది. నాలుగేళ్ల పాటు- విచారణ జరిపిన సిట్‌ 2012 ఫిబ్రవరిలో అల్లర్లలో మోడీ పాత్ర లేదంటూ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. దీనిని జకియా న్యాయస్థానంలో సవాల్‌ చేసింది. ఆమె పిటిషన్‌ పైన విచారణ జరిపిన కోర్టు తీర్పులో మోడీకి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *