నా బంగ్లా డూప్లెక్స్ : కేజ్రీవాల్
న్యూఢిల్లీ, జనవరి 3 (జనంసాక్షి) :
ప్రధాని ఎవరన్నది ప్రధానం కాదని, ప్రజలకు ఉపయోగ పడేలా పాలన సాగడమేఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ముఖ్యమంత్రిగా తనకు కేటాయించిన అధికారిక నివాస బంగళాను, గత ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌కు కేటాయించిన బంగళాను పోల్చి చూసుకోవాలని ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీడియాకు సూచించారు. తనకు ఇటీవలే న్యూఢిల్లీలో కేటాయించిన బంగళా చాలా నిరాడంబరంగా ఉంటుందని ఆయన చెప్పారు. మీ కొత్త అధికారిక నివాసం ఎలా ఉంటుందని విలేకరులు శుక్రవారం ఆయనను ప్రశ్నించినప్పుడు ”మీరు కావాలనుకుంటే కెమెరాలు తీసుకుని నా ఫ్లాట్‌కు రావచ్చు. ఇదివరకటి సిఎం (షీలా దీక్షిత్) నివాసంతో మీరే పోల్చుకుని చూడోచ్చు” అని కేజ్రీవాల్ సూచించారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు న్యూఢిల్లీలోని భగవాన్ దాస్ రోడ్డులో రెండు డూప్లెక్స్ ప్లాట్లను ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో ప్లాట్‌లో ఐదు గదులు ఉంటాయి. యమునా నది కుడివైపు ఒడ్డున ఉన్న బహుళ అంతస్తుల ఢిల్లీ ప్రభుత్వ సచివాలయం ప్లేయర్స్ బిల్డింగ్‌కు కూతవేటు దూరంలో ఈ ప్లాట్లు ఉన్నాయి. నాకు రెండు ఫ్లాట్టు కేటాయించారు. ఒకటి నేను నివసించడానికి, మరొకటి నా కార్యాలయంగా ఉపయోగిస్తాను అని కేజ్రీవాల్ వివరించారు.విఐపి సంస్కృతిని వ్వతిరేకిస్తున్న 45 ఏళ్ల కేజ్రీవాల్ మొదట్లో ప్రభుత్వ బంగళాలోకి మారడానికి నిరాకరించారు. ఢిల్లీకి పొరుగున ఉన్న ఘజియాబాద్‌లోని తన కౌశంబి అపార్ట్‌మెంట్ ఫ్లాట్ నుంచి పనిచేయడానికే ఆయన ఇష్టపడ్డారు.
ప్రధాని ఎవరన్నది ప్రధానం కాదు




