Tuesday, 3 November 2026

తుస్సుమన్న సమైక్య సంకల్పం

సగం మంది డుమ్మా
హైదరాబాద్‌, జనవరి 3 (జనంసాక్షి) :
సమైక్య సంకల్ప దీక్ష తుస్సుమంది. సగం మంది ఎంపీలు ఈ దీక్షకు డుమ్మా కొట్టారు. సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తామని కాలర్‌లు ఎగురేసుకోవడమేకాక, గొంతులు చించుకుని అరిచిన సీమాంధ్రకు చెందిన ఎంపీలు నిట్టనిలువునా చీలిపోయారు. 36 గంటలపాటు ఇందిరాపార్క్‌ వద్ద దీక్ష చేస్తామని చెప్పిన ఎంపీలు చెప్పినట్టుగా దీక్షకు రాలేదు. రాష్ట్రవిభజనకు వ్యతిరేకంగా రాజీనామాలు చేసిన ఆరుగురు ఎంపిలం వచ్చి హైదరాబాద్‌ నడిబొడ్డున దీక్ష చేసి చూపిస్తామని చెప్పిన ప్రకారమే తాము దీక్షకు దిగామని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ పేర్కొన్నారు. అయితే ఆరుగురు ఎంపిలు దీక్షలు చేపడుతారని చెప్పిన రాజగోపాల్‌, హర్షకుమార్‌కు తీవ్ర ఆశాభంగమే కలిగింది. ఆరుగురికి బదులుగా కేవలం ముగ్గురు మాత్రమే దీక్షలో కూర్చుని తమలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఐకమత్యం లేదని నిరూపించుకున్నారు. మిగతా వారు మాత్రం తాము అధిష్టానంకు అనుంగుగా ఉండాలనే నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని ఈతరుణంలో ఎవరేం చేసినా రాష్ట్ర విభజన ఆగనే ఆగదని తెలిసి దీక్షకు దూరంగా ఉన్నామనే భావాన్ని వారు వారి సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దుర్మార్గంగా వ్యవహరించిన తీరును సైతం కప్పిపుచ్చుకునే ప్రయత్నమే చేశారు మన విజయవాడ ఎంపీ లగడపాటి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *