Tuesday, 3 November 2026

జస్టిస్‌ గంగూలీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్‌ ఎ.కె. గంగూలీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమబెంగాల్‌ మానవహక్కుల సంఘం ఛైర్మన్‌ పదవి నుంచి గంగూలీని తొలగించకుండా కేంద్రాన్ని నిలువరించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్‌ గంగూలీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌ను కూడా కొట్టివేసిన న్యాయస్థానం చట్టం తన పని తాను చేస్తుందని వ్యాఖ్యానించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *