Tuesday, 3 November 2026

ప్రశాంత్‌ భూషణ్‌ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, జనవరి 6
(జనంసాక్షి) :
ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్‌ భూషణ్‌ కాశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. సోమవారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడారు. ప్రశాంత్‌ భూషణ్‌ వ్యాఖ్యలతో పార్టీ ఏకీభవించడం లేదని ఆయన చెప్పారు. ఒక టీవీ ఛానల్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రశాంత్‌ భూషణ్‌ కాశ్మీర్‌ లోయలో రెఫరండం నిర్వహించాలన్నారు. వారి భద్రత గురించి ప్రజలే నిర్ణయించుకునే స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. ఈ అభిప్రాయం తమ పార్టీది కాదని అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *