Tuesday, 3 November 2026

జస్టిస్‌ గంగూలీ రాజీనామా

న్యూఢిల్లీ, జనవరి 6 (జనంసాక్షి) :
విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే అభియోగాలు ఎదుర్కొంటున్న జస్టిస్‌ గంగూ లీ సోమవారం పశ్చిమబెంగాల్‌ మాన వ హక్కుల కమిషన్‌ (డబ్ల్యూహెచ్‌ఆర్‌సీ) చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పశ్చిమబెంగాల్‌ గవ ర్నర్‌ ఎం.కె. నారాయణన్‌కు సుప్రీంకోర్టు మాజీ జడ్జి తన రాజీనామా పత్రాన్ని అంద జేశారు. రాజ్‌భవన్‌ వద్ద గవర్నర్‌తో దాదాపు 45 నిమిషాలు గడిపారు. రాజీనామా చేశారా అని విలేరులు జస్టిస్‌ గంగూలీని ప్రశ్నించగా నేనేం మాట్లాడను అని ఆయన బదులిచ్చారు. నాతో మాట్లాడిన ఒక రోజు తర్వాత గంగూలీ రాజీనామా చేయడం మంచి పరిణామమని మాజీ అటార్నీ జనరల్‌ సోలీ సొరాబ్జీ ఢిల్లీలో అన్నారు. జస్టిస్‌ గంగూలీ ఆదివారం మాజీ అటార్నీ జనరల్‌కు ఫోన్‌ చేశారు. డబ్ల్యూహెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేయాలనే ఆలోచనలో తాను ఉన్నట్లు తెలిపారు. కాగా జస్టిస్‌ గంగూలీ రాజీనామా కోసం గట్టిగా గళం విన్పిస్తూ వస్తున్న అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఇందిరా జైసింగ్‌ దీనిపై స్పందించారు. జస్టిస్‌ గంగూలీ సరైన నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *