హైదరాబాద్, జనవరి 7 (జనంసాక్షి) :
హీరో ఉదయ్‌కిరణ్‌కు అభిమానులు కన్నీటితో కడసారి వీడ్కోలు పలికారు. మంగళవారం ఉదయం నిమ్స్ ఆస్పత్రి మార్చురీ నుంచి ఫిలిం ఛాంబర్‌కు ఆయన మృతదేహాన్ని తరలించి అభిమానుల సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఎర్రగడ్డ శ్మశానవాటికకు తరలించారు. అక్కడ అభిమానులు కొందరు నటుల సమక్షంలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. ఉదయ్‌ను కడసారి చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. యువహీరోకు వీరంతా అంతిమ నివాళి అర్పించారు. ఉదయ్‌కిరణ్ ఆదివారం అర్ధరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సినీ హీరో ఉదయ్‌కిరణ్ మృతదేహాన్ని నిమ్స్ నుంచి మంగళవారం ఉదయం శ్రీనగర్ కాలనీలోని ఆయన నివాసానికి తరలించారు. ఉదయం 10గంటల నుంచి 11.45 వరకు ఫిల్మ్‌నగర్‌లోని ఫిలిం ఛాంబర్‌లో అభిమానుల సందర్శనార్థం ఉదయ్‌కిరణ్ పార్థీవ దేహాన్ని ఉంచారు. అక్కడ అనేకులు సందర్శించి నివాళులు అర్పించారు. సినీ నటుడు ఉదయ్‌కిరణ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఫిలింనగర్‌లోని ఫిలింఛాంబర్‌లో సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉదయ్‌కిరణ్ మృతదేహాన్ని ఉంచారు. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు, దర్శకుడు దాసరి నారాయణరావు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, నటులు వెంకటేష్, శ్రీకాంత్, అల్లరి నరేష్, సునీల్, వరుణ్ సందేశ్, తనికెళ్ల భరణి, చలపతిరావు, జయసుధ తదితరులు ఉదయ్‌కిరణ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఉదయ్‌కిరణ్ మృతి సినీ రంగానికి తీరని లోటని వారు పేర్కొన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు అత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఉదయ్‌కిరణ్ మృతి వార్తను ఇంకా జీర్ణించుకోలేక పోతున్నానని నటుడు శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం 6.30 గంటలకు నిమ్స్ ఆసుపత్రి నుంచి ఉదయ్‌కిరణ్ మృతదేహాన్ని శ్రీనగర్‌కాలనీలోని ఆయన ఇంటికి తరలించారు. అభిమానులు పెద్ద ఎత్తున ఇంటికి చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వెంటనే ఉదయ్‌కిరణ్ మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఫిలింఛాంబర్‌కు తరలించారు. ఫిలింఛాంబర్‌లో ప్రముఖుల సందర్శన అనంతరం అభిమానుల అశ్రునయనాల మధ్య భౌతికకాయాన్ని ఎర్రగడ్డ శ్మశాన వాటికకు తరలించారు. సినీ నటుడు ఉదయ్‌కిరణ్ జీవితంతో కొన్ని శక్తులు ఆడుకున్నాయని, దీంతో డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. సినీ పరిణామాలపై ఇండస్టీక్రి వచ్చే కొత్త వారు ఆలోచించుకోవాలని కోరారు.
రెండుసార్లు ఆత్మహత్యా యత్నం
సినీనటుడు ఉదయ్‌కిరణ్ ఇదివరకు రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదికల్లో వెల్లడైంది. ఉరివేసుకునే ముందు ఆయన చేతి మణికట్టు వద్ద నరాలు కోసుకునే ప్రయత్నం చేశారని ఫోరెన్సిక్ నివేదిక పేర్కొంటోంది. భార్య విషిత, ఉదయ్‌కిరణ్ కాల్ డేటాలను తెప్పించిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆత్మహత్యకు ముందు భార్య విషిత నుంచే ఉదయ్‌కిరణ్‌కు సంక్షిప్త సందేశాలు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
ఉదయ్‌కిరణ్‌కు అంతిమ వీడ్కోలు




