మళ్లీ వాయిదా
హైదరాబాద్, జనవరి 7 (జనంసాక్షి) :
రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. మంగళవారం ఎలాంటి చర్చ జరగకుండానే ఉభయ సభలు వాయిదాపడ్డాయి. అసెంబ్లీ నాలుగో రోజు మంగళవారం కూడా ఎలాంటి కార్యాకాలపాలను చేపట్టకుండానే బుధవారానికి వాయిదా పడింది. ఉదయం సమావేశమయ్యాక రెండు పర్యాయాలు వాయిదా అనంతరం శాసనసభ తిరిగి ఒకటిన్నర ప్రాంతంలో ప్రారంభమైంది. ఇరు ప్రాంతాల సభ్యులు సభాపతి పోడియం వద్ద చేరి నినాదాలు చేశారు. వారిని తమ తమ స్థానాల్లో కూర్చోవాల్సిందిగా ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క పలుమార్లు విజ్ఞప్తి చేశారు. తమ పార్టీల సభ్యులను కూర్చోమని చెప్పాల్సిందిగా ఫ్లోర్ లీడర్లకు సూచించారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, వైకాపా అధ్యక్షురాలు విజయమ్మలను వారి పార్టీ సభ్యులకు నచ్చజెప్పాల్సిందిగా ఉపసభాపతి సూచించారు. ముఖ్యమైన బిల్లుపై చర్చ జరపాల్సివుందని, సహకరించాలని ఆయన ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు. గత నాలుగురోజులుగా శాసనసభలో వాయిదాల పర్వం ఉదయం నుంచి కొనసాగింది. మంగలవారం ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాక స్పీకర్ సభలోకి ప్రవేశించగానే ఇరు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో ¬రెత్తించారు. సభ్యుల ఆందోళనల మధ్యే విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. సభ నిర్వహణకు సహకరించాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా సభ్యులు పట్టించుకోలేదు. దీంతో సభను గంటపాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రెండో సారి సభ ప్రారంభమైన వెంటనే సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలివ్వడం ప్రారంభించారు. స్పీకర్ ఎంతవారించినా సభ్యులు పట్టించుకోలేదు. దీంతో రెండో సారి సభను అరగంటపాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో అసెంబ్లీలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. రెండో విడత ఈ నెల 3న ప్రారంభమైన అసెంబ్లీ ఏ ఒక్కరోజు కూడా కనీస చర్చ లేకుండానే వాయిదా పడుతూ వస్తోంది. తాజగా మంగళవారం కూడా శుక్ర, శని, సోమవారం నాటి పరిస్థితులే దర్శనమిచ్చాయి. దీంతో యధావిధిగా సభ బుధవారానికి వాయిదా పడింది. ఉదయం సభ ప్రారంభం కాగానే వివిధ వాయిదా తీర్మానలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. అనంతరం సభలో కార్యక్రమాల కొనసాగింపంపునకు స్పీకర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
తీరుమారని అసెంబ్లీ




