Wednesday, 4 November 2026

మన ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి

ప్రధాని మన్మోహన్‌
న్యూఢిల్లీ, జనవరి 8 (జనంసాక్షి) :
భారత దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. 12వ ప్రవాస భారతీయ దివస్‌ సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ఇన్‌క్రెడిబుల్‌ ఆపర్చునిటీస్‌ బ్యాక్‌ హోం’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. దేశం ఆర్థికంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నా ఇంకా బలంగానే ఉందని చెప్పారు. ప్రపంచం మొత్తం ఆర్థిక మందగమనంలోనే ఉందని, అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలు ఆర్థికంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. గతేడాది రూపాయి పతనం దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసిందని వివరించారు. బంగారంపై మన దేశస్తులకు ఉన్న వల్లమాలిన ప్రేమతోనే దానిని దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. మరోవైపు అమెరికా తీసుకున్న ఫెడరల్‌ రిజర్వు నిర్ణయం వల్ల ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు భారీ హెచ్చు తగ్గులకు లోనయ్యాయని, విదేశీ ఇన్వెష్టర్లు దేశీయ పెట్టుబడులకు దూరమవడం కూడా రూపాయి పతనానికి కారణమైందని వివరించారు. మరోవైపు ఆహార ద్రవ్యల్బోణం సూచీ పెరిగిపోవడంతో సామాన్యులు అవస్థలు ఎదుర్కొన్నా ఏడాది అంతానికి ఆర్థికంగా పుంజుకుమాన్నమని ఆయన వివరించారు. నూతన సంవత్సరంలో మరిన్ని సవాళ్లను అధిగమిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *