Wednesday, 4 November 2026

ఓటింగ్‌ సవరణ అధికారం అసెంబ్లీకి లేదు

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
హైదరాబాద్‌, జనవరి 8 (జనంసాక్షి) :
తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఓటింగ్‌ సవరణల అధికారం రాష్ట్ర అసెంబ్లీకి లేదని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. టీజీవో భవన్‌లో బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన తెలంగాణ ఉద్యోగుల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్‌, బిజెపి, కాంగ్రెస్‌, టీడీపీ తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ బిల్లుపై ముఖ్యమంత్రి సహా సీమాంధ్ర నేతలు చేస్తున్న ప్రచారం విచిత్రంగా ఉందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ ముసాయిదాపై చర్చించి అభిప్రాయాలు చెప్పే అవకాశం మాత్రమే శాసనసభకు ఉందని, కానీ అందుకువిరుద్ధంగా సీమాంధ్ర నేతలు తప్పుడు మాటలతో కాలయాపన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉగాది పండుగ వేడుకలను రెండు రాష్ట్రాల ప్రజలు జరుపుకోనున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లు, అందులో సవరణలు, అభ్యంతరాలు తదితర విషయాలపై తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఉద్యోగుల విభజన,పెన్షన్‌, విద్య, ఆదాయం తదితర అంశాలపై చర్చిస్తున్నారు. డీఎస్‌ మాట్లాడుతూ తెలంగాణ బిల్లుపై చర్చ జరగాల్సిందేనని అన్నారు. తెలంగాణను సాధించుకునేంతవరకు జాగ్రత్తగా ఉండాలన్నారు. లక్ష్యం సాధించుకునే వరకు వెనుకడుగు వేయొద్దని సూచించారు. తెలంగాణకు తాను సహకరించలేదని కొందరు అనడం సరైంది కాదన్నారు. తన వంతుగా కృషి తాను చేశానన్నారు. సోనియా దయ వల్లే కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం అయ్యాడన్నారు. కిరణ్‌ను సంప్రదించాకే అధిష్టానం తెలంగాణపై నిర్ణయం తీసుకున్నదని అన్నారు. అయితే సోనియా నిర్ణయాన్ని సీఎం వ్యతిరేకించి గందరగోళం సృష్టించారని అన్నారు. విభజన ప్రక్రియలో తమను సంప్రదించలేదని కొన్ని పార్టీలు వ్యాఖ్యలు చేయడం అబద్దమన్నారు. అంతకుముందు ఎంపి మధుయాష్కీ మాట్లా డుతూ ఎవరెన్ని రంకెలు వేసినా తెలంగాణ ఆగబోదని అన్నారు. కొందరు రాజకీయ పార్టీల నాయకులు సొంత లాభం మానుకుంటే వెంటనే తెలంగాణ వస్తుందని అన్నారు. ఫిబ్రవరిలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణబిల్లును ప్రవేశపెట్టడం ఖాయమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *