ఏ పార్టీతో పొత్తులుండవ్
జయప్రకాశ్ భేటీ అనంతరం కేజ్రీవాల్
న్యూఢిల్లీ, జనవరి 11 (జనంసాక్షి) :
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ నిర్వహించిన జనతాదర్బార్‌కు అనూహ్య స్పందన లభించింది. రెండో శనివారంలో జనతాదర్బార్‌ను నిర్వహించనున్నట్లు ఆమ్‌ఆద్మీపార్టీ ముందుగానే ప్రకటించారు. దీంతో వేలాదిగా ప్రజలు తమ వినతులను సమర్పించేందుకు తరలి వచ్చారు. దాదాపు 50 వేల మంది వచ్చి ఉంటారని భావిస్తున్నారు. కేజీవ్రాల్, తదితర మంత్రులు ఢిల్లీ సెక్రటేరియట్‌కు చేరుకునే లోపే తమ సమస్యలు చెప్పుకునేందుకు భారీగా ప్రజలు డిల్లీ అక్కడికి తరలివచ్చారు. పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే ప్రజలు వాటిని తోసుకుని సెక్రెటేరియట్‌లోకి రావడంతో కేజీవ్రవాల్ అక్కడి నుంచి వెళిపోయారు. కేజీవ్రాల్ శనివారం ఉదయం జనతాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఉదయం 11.30గంటల వరకు దర్బార్ కొనసాగనుందని ప్రకటించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించిన జనతా దర్బార్‌కు అనూహ్య స్పందన వచ్చింది. ఢిల్లీ సెక్రటేరియట్ ఆవరణలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం శనివారం నిర్వహించిన జనతా దర్బార్‌కు వేలాది మంది ప్రజలు చేరుకోవడంతో తొక్కిసలాడే ప్రమాదం ఉందని భావించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, పోలీసుల సూచనతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాము ఇంకా ఎక్కువగా మెరుగైన ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని కేజ్రివాల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాను ఇక్కడి నుంచి వెళ్లిపోకపోయినట్లయితే తొక్కసలాట జరిగే ప్రమాదముందని కేజ్రివాల్ అన్నారు. అందుకే తాను వెళ్లాల్సి వస్తోందని ఆయన చెప్పారు. మరో నాలుగు నుంచి ఐదు రోజుల్లో మరో ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఒక్కో వారం ఒక్కో అంశంపై జనతా దర్బార్ పెట్టకపోతే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఫిర్యాదుల్లో అధిక శాతం అధికారులపైనే వచ్చాయని కేజ్రివాల్ వెల్లడించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజీవ్రాల్ తెలిపారు. లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణతో భేటీ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జేపీతో భేటీ సాధారణమైనది మాత్రమేనని ఆయన పేర్కొన్నారు లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ కేజీవ్రాల్‌ను కలిశారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో పొత్తు విషయమై ఆయన కేజీవ్రాల్తో చర్చలు జరిపారు. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనలో లోక్‌సత్తా పార్టీ ఉంది. అనంతరం జెపి మాట్లాడుతూ కేజీవ్రాల్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు- చెప్పారు. పార్టీ విలీనమా? పొత్తా? అనేది మున్ముందు విూకే తెలుస్తుందన్నారు. దేశ ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధం అని చెప్పారు. ఇదిలావుంటే రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. తెలంగాణకు తమ పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. అయితే విభజన అనేది ఏకపక్షంగా జరుగకూడదని తాము చెబుతున్నట్లు తెలిపారు. ఇదిలావుంటే, లోకసత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అవినీతి వ్యతిరేకత ఎజెండాగానే రాజకీయాల్లోకి వచ్చారు. పారదర్శకత, అవినీతి రాహిత్యం అనేవి ఆయన ప్రధాన అంశాలుగా చేసుకున్నారు. అయితే, గత ఎన్నికల్లో జయప్రకాష్ నారాయణ ఒక్కరు మాత్రమే గెలిచారు. అయితే, ఆయన పార్టీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీని ఓడించడానికి పనికి వచ్చారనే విశ్షేషణ ఒక్కటి ముందుకు వచ్చింది. ప్రస్తుతం జయప్రకాష్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్‌తో కలిసి పనిచేయడానికి ఉత్సుకత చూపుతున్నట్లు కనిపిస్తున్నారు. జయప్రకాష్ నారాయణ శనివారం కేజీవ్రాల్‌తో సమావేశమయ్యారు. భారతదేశంలో అన్ని చోట్లా అందరం విఫలమయ్యామని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కేజీవ్రాల్‌తో సమావేశమైన తర్వాత ఆయన విూడియాతో మాట్లాడారు. అయితే, కేజీవ్రాల్ మాత్రం తాము పొత్తులకు సిద్ధంగా లేమని చెప్పారు. రెండు పార్టీల మధ్య విస్తృతమైన చర్చలు అవసరమని ఆయన అన్నారు. మరోసారి సమావేశమవుతామని ఆయన చెప్పారు. ఈ నెల 16వ తేదీన మళ్లీ సమావేశమవుతామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరమని తమ పార్టీ చెప్పిందని ఆయన అన్నారు. స్పష్టమైన విధానాలను తమ పార్టీ చెబుతుందని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాలవారు సంతృప్తి చెందే విధంగా ప్రతిపాదనలు చేస్తామని ఆయన చెప్పారు. లోకసత్తా తమ పార్టీలో విలీనమవుతుందో లేదో జెపినే అడగాలని కేజీవ్రాల్ అన్నారు. లోకసత్తాను ఆమ్ ఆద్మీ పార్టీలో విలీనం చేయాలని కేజీవ్రాల్ అడుగుతున్నట్లు సమాచారం. ఏ పార్టీతోనూ తమకు పొత్తులుండవని కేజీవ్రాల్ అంటూ లోకసత్తా తమ పార్టీలో విలీనమవుతుందో లేదో జెపిని అడగాలని అన్నారు. జెపి మాత్రం విలీనం చేయడానికి బదులు కలిసి పనిచేయడానికి ఇష్టపడుతున్నట్లు అర్థమవుతోంది. ఇదిలావుంటే అతి తక్కువ వ్యవధిలోనే ఆప్ ఢిల్లీలో అధికారం చేపట్టడంతో అందరి దృష్టి దానిపై పడింది. సామాన్యుల పార్టీగా ముద్రపడటంతో ప్రజలు కూడా ఆప్ వైపు చూస్తున్నారు. కేజీవ్రాల్ అధికార పీఠాన్ని అధిష్టించి పేద ప్రజలకు ఆశలు కల్పించారు. అయితే ఆప్ పైపు ఆశగా చూసే కొందరు కాంగ్రెస్ మద్దతు స్వీకరించడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. మరోవైపు ఢిల్లీ సచివాలయం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జనతా దర్బార్లో గందరగోళం నెలకొంది. దీంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ మధ్యలోనే వెళ్లిపోవాల్సి వచ్చింది. వేలాది మంది ప్రజలు తమ కష్టాలు చెప్పుకోడానికి వచ్చారు. అక్కడకు ముఖ్యమంత్రితో పాటు మొత్తం మంత్రులంతా వచ్చారు. బ్యారికేడ్లు కూడా పడగొట్టి మరీ జనం తోసుకురావడంతో వారిని నియంత్రించడం ఢిల్లీ పోలీసులకు కష్టమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో కేజీవ్రాల్ సగంలోనే కార్యక్రమం వదిలి వెళ్లిపోయారు.అంతమంది ప్రజలు వస్తారని ఊహించలేకపోయామని, అందుకే వారిని నియంత్రించడం కష్టమైందని, తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని పోలీసులు చెప్పడం వల్లే అక్కడినుంచి వెళ్లానని తర్వాత కేజీవ్రాల్ విలేకరులకు తెలిపారు. దాదాపు 50 వేల మంది ప్రజలు అక్కడికొచ్చినట్లుత పోలీసులు చెప్పారు. వారిలో ఎక్కువ మంది డీటీ-సీ, బీఎస్‌ఈఎస్, వివిధ ప్రభుత్వాస్పత్రులు, మునిసిపాలిటీల్లాంటి శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులే ఉన్నారు. తన ఫ్లాటును కొంతమంది ఆక్రమించుకున్నారని సునీతాకపూర్ అనే మహిళ చెప్పారు. ఆమె ఉదయం ఆరు గంటలకే అక్కడకు చేరుకున్నారు. ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించేవరకు తాను విశ్రమించేది లేదని కేజీవ్రాల్ ఈ సందర్భంగా చెప్పారు.





