Tuesday, 3 November 2026

ప్రజల కోసమే పోలీస్‌

డీజీపీ ప్రసాదరావు

మహబూబ్‌నగర్‌, జనవరి 11 (జనంసాక్షి) :

ప్రజల కోసమే పోలీసులున్నారని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. తాము ఎప్పటికీ ప్రజాసేవలో ముందుంటామన్నారు. ఎవరికి ఆపద వచ్చినా పోలీసులు ఉన్నారన్న ధైర్యం కలిగిస్తామన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో ఉన్న డీజీపీ మాట్లాడుతూ.. అవసరమైన చోట పోలీసులకు క్వార్టర్స్‌ నిర్మిస్తామన్నారు. ¬ంగార్డులకు వేతనాలు మిగతా రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలోనే మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. భవిష్యత్‌లో ¬ం అదాలత్‌ ద్వారా కేసులు పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. షాద్‌నగర్‌లో పోలీస్‌ స్టేషన్‌ను ఆయన పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *