Wednesday, 4 November 2026

టీ బిల్లుకు.. అవసరమైతే ప్రత్యేక సమావేశాలు

2014 ఎన్నికలకు ముందే తెలంగాణ ఏర్పాటు ఖాయం
అందరు అభిప్రాయాలు చెప్పండి : దిగ్విజయ్‌
న్యూఢిల్లీ, జనవరి 13 (జనంసాక్షి) :
తెలంగాణ బిల్లుపై చర్చించేందుకు ఓటింగ్‌ కోసం అవసరమైతే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. బిల్లు కోసం కాంగ్రెస్‌ చిత్తశుద్దితో పని చేస్తోందని అన్నారు. 2014 ఎన్నికల్లోపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేలా ప్రయత్నిస్తామని అన్నారు. ఢిల్లీలో ఆయన విూడియాతో మాట్లాడుతూ… అవసరమైతే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే బిల్లు అసెంబ్లీలో చర్చ సాగుతోందని అన్నారు. ఈ నెల 23 వరకు గడువు ఉందన్నారు. బిల్లు అసెంబ్లీ నుంచ ఇరాష్ట్రపతికి, ఆ తరవాత పార్లమెంటుకు వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్‌ విలీనంపై మాట్లాడుతామని స్పష్టం చేశారు. దీనిపై ఇప్పుడే తొందర పడాల్సిన అవసరకం లేదన్నారు. బిల్లుపై సీమాంధ్ర నేతలు వ్యతిరేకిస్తున్న విషయాన్ని ప్రస్తావించగా బిల్లుపై చర్చ సాగుతోందన్నారు. తెలంగాణకు ప్రత్యేక ప్టీరింగ్‌ కమిటీ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందన్నారు. ఇదే సరైన సమయం.. సద్వినియోగం చేసుకోండి.. అభిప్రాయాలు చెప్పండి అని సూచించారు. అసెంబ్లీలో తమ ప్రాంతాలపై అభిప్రాయాలు చెప్పుకునేందుకు శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలకు ఇదే మంచి సమయమని చెప్పారు. బిల్లుపై చర్చకు గడువు పొడిగింపు విషయంలో రాష్ట్రపతి ప్రణబ్‌దే తుది నిర్ణయమని తెలిపారు. అవసరమైతే టి.బిల్లు కోసం పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు చేపడతామని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు డిమాండును అధిష్టానం పరిశీలిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాకే టిఆర్‌ఎస్‌ విలీనంపై మాట్లాడతానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *