కురకచర్ల : రంగారెడ్డి జిల్లా కురకచర్ల మండల పరిధిలోని చాకలపల్లి గ్రామంలో బుధవారం ఉదయం చిరుతపులి పట్టుబడింది. గత 15 రోజుల వ్యవధిలో మూడు గేదెలపై చిరుత దాడి చేసి హతమార్చింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు చిరుత తిరిగిన ప్రాంతంలో వలను కట్టిఉంచారు. దీంతో బుధవారం ఉదయం వలలో చిక్కుకుంది. స్థానికులు అటవీ, జూ అధికారులకు సమాదచారం అందించారు.




