Wednesday, 4 November 2026

మేడారానికి రోజూ ప్రత్యేక బస్సులు

వరంగల్‌,జనవరి16: ఫిబ్రవరి 12,13,14 తేదీల్లో జరిగే మేడారం జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేక బస్సులు నడిపేందుకు సమాయత్తం అవుతోంది. జాతరను భక్తులు ముందస్తుగానే దర్శించుకునేందుకు వీలుగా ఏపీఆర్టీసీ వరంగల్‌ రెండో డిపో నుంచి బస్సులు నడుపుతోంది. రోజూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ప్రతి గంటకు ఒక బస్సును ఉంటుందని వరంగల్‌-2 డిపో మేనేజర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇదిలావుంటే సమ్మక్క దేవతకు సంబంధించిన ధ్వజస్తంభాలను సిద్దబోయిన వంశీయులు పునఃప్రతిష్ఠించారు. మేడారంలోని సమ్మక్కదేవత పూజామందిరం సవిూపంలో, గ్దదెకు సవిూపంలో చాలా సంవత్సరాల క్రితం పూజారులు స్థానిక అడువుల్లో లభించే ఓ చెట్టుతో ధ్వజస్తంభాలను తయారు చేసి ప్రతిష్టించారు. ఈసారి భారీ వర్షాలు కురియడంతో రావిచెట్టు కొమ్మవిరిగి గ్దదెల సవిూపంలోని ధ్వజస్తంభంపై పడటంతో పక్కకు ఒరిగిపోయింది. సమ్మక్క పూజా మందిరం సవిూపంలో కొత్తగా చేపడుతున్న రోడ్డు విస్తరణలో మరో ధ్వజస్తంభం పోతుంది. దీనిపై దృష్టి సారించిన పూజారులు తమ సంప్రదాయ పద్ధతులతో వాటిని పునఃప్రతిష్ఠించారు. తొలుత సమ్మక్క పూజామందిరం వద్ద రోడ్డు పక్కన ఉన్న ధ్వస్తంభాన్ని తీసి.. మరోచోట ప్రతిష్ఠించారు. అనంతరం ఆలయంలోని డోలివాయిద్యాలతో గ్దదెలకు వద్దకు వెళ్లి ఒరిగిపోయిన దానిని తవ్వి సరిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *