ప్రధానితో భేటీ.. పలు అంశాలపై చర్చలు
న్యూఢిల్లీ, జనవరి 16 (జనంసాక్షి) :
దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హై నాలుగు రోజుల పర్యటన కోసం గురువారం దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆమె పర్యటనలో భారత్-దక్షిణ కొరియాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడేందుకు దోహద పడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె ఢిల్లీకి చేరుకున్న అనంతరం భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, భారత్-దక్షిణ కొరియా మధ్య దౌత్య సంబంధాలకు 1973లోనే శ్రీకారం చుట్టారని, 1993లో పీవీ నర్సింహారావు ప్రధాని మంత్రిగా కొరియా సందర్శనతో ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు బలోపేతమయ్యేందుకు పునాది వేసిందని పేర్కొన్నారు. 2010లో కొరియా అధ్యక్షురాలు లీ మ్యుంగ్ బాక్ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథి హాజరవడం, 2012లో భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ కొరియా సందర్శించడంతో స్నేహ సంబంధాలు మరింత విస్తృతమయ్యాయి. వాణిజ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగు పరుచుకునేందుకు అధ్యక్షురాలు గ్వెన్ పర్యటనకు వచ్చినట్లు సమాచారం. ఆమె వెంట ఆ దేశ విదేశీ వాణిజ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్నారు.
భారత్ చేరిన దక్షిణ కొరియా అధ్యక్షురాలు




