న్యూఢిల్లీ, జనవరి 17 (జనంసాక్షి) :
కేంద్ర మంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్(52) అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఢిల్లీలోని లీలా ఫైవ్‌స్టార్ హోటల్‌లోని 345 నంబర్ గదిలో శుక్రవారం రాత్రి సునంద మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆమె మృతికి గాల కారణాలు తెలియరాలేదు. ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సునంద ఆత్మహత్య చేసుకున్నారని శశిథరూర్ తమకు ఫోన్‌లో తెలిపారని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు చెందిన జర్నలిస్టు మెహర్ తరార్‌తో తన భర్త శశిథరూర్‌కు సంబంధాలున్నాయంటూ ఆమె ట్విట్టర్‌లో వెల్లడించారు. మెహర్ తరార్ ఐఎస్‌ఐ ఏజెంట్ కూడా అని సునంద ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆమె తన కాపురంలో నిప్పులు పోరాశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భర్త శశిథరూర్‌కు, మెహర్‌కు మధ్య కొన్నాళ్లుగా రహస్య సందేశాలు నడుస్తున్నాయని సునంద ఆరోపించారు. 2010 ఆగస్టులో సునంద పుష్కర్‌ను శశిథరూర్ వివాహం చేసుకున్నాడు. వారిద్దరి ఇది మూడో వివాహం. కొన్నాళ్లుగా వీరిమధ్య సత్సబంధాలు లేన్నట్లుగా తెలిసింది. అయితే శశిథరూర్ వివాహేతర సంబంధాలున్నట్లు ఆరోపించడంపై పాకిస్థానీ జర్నలిస్టు మెహర్ తీవ్రంగా స్పందించారు. తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని ఆమె సునంద ఆరోపణలను తోసిపుచ్చారు. సునంద వ్యాఖ్యలు మీడియాలో కలకలం సృష్టించడంతో శశిథరూర్, సునంద సయుక్తంగా ప్రకటన జారీ చేశారు. తమ మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయని, తమ ట్విట్టర్ ఖాతాలను ఎవరో హ్యాక్ చేశారంటూ వారిద్దరూ గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అయితే ప్రకటన జారీ చేసిన 24 గంటలు గడవక ముందే సునంద అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.
అయితే రెండు రోజులుగా వీరి వివాదం సాగుతోన్న శుక్రవారం సాయంత్రం ఏఐసీసీ సమావేశానికి థరూర్ హాజరయ్యారు. సమావేశం వివరాలను ఎప్పటికప్పుడు ట్వీట్ చేస్తూ సరదాగా గడిపారు.
సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి




