Tuesday, 3 November 2026

సభ్యులు సంయమనాన్ని పాటించాలి: ఆనం

హైదరాబాద్‌: సభ సమయాన్ని వృథా చేసుకోవడం మంచిపద్దతి కాదని, సభ్యులందరు సంయమనం పాటించాలని మంత్రి ఆనం రాంనారామణరెడ్డి కోరారు. టీ బిల్లుపై చర్చ జరగాలని సభ్యులందరు కోరుకున్నట్లు ఆయన చెప్పారు. సభను అడ్డుకోవడం మంచి పద్దతి కాదన్నారు. సభ్యులు తమతమ స్థానాల్లో కూర్చోని అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అన్ని పార్టీల ప్లోర్‌ లీడర్లు సభ సజావుగా నడిచేందుకు సహకరించాలని మంత్రి అనం కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *