Wednesday, 4 November 2026

తెలంగాణ ఏర్పాటు అనివార్యం : జేపీ

హైదరాబాద్‌: బలవంతంగా రాష్ట్రాన్ని కలిపి ఉంచలేమని, అపారమైన జన నష్టం జరిగే ప్రమాదముందని లోక్‌ సత్తా అధ్యక్షుడు జమప్రకాశ్‌ నారాయణ్‌ అన్నారు. టీ బిల్లు చర్యపై ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇవాళ అవసరం, అనివార్యంమన్నారు.బలవంతంగా ఐక్యంగా ఉంచలేమని ఆయన చెప్పారు.

లోక్‌సత్తా పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. భాషా ప్రాతిపాదికన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిందని, ఏడు అంశాలపై పెద్ద మనుషుల ఒప్పందం జరిగిందని ప్రాంతీయ కమిటీల ఏర్పాటు నిర్ణయం అమలులో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. సకాలంలో సరైన రీతిలో స్పందించి ఉంటే రాష్ట్రంలో ఈ పరిస్థితి చ్చేది కాదన్నారు. ప్రపంచంలోని తెలుగు ప్రజల్లో ఎన్నో ఆశలు, భయాలు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందరిని ఒప్పించి రాష్ట్రంను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం తెలుగు ప్రజల చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *