ఢిల్లీ: 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఢిల్లీలో ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో రాహుల్ సమావేశం ముగిసింది. గంటన్నారకు పైగా ఈ సమావేశం కొనసాగింది. సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హాజరుకాలేదని సమాచారం. ఉదయం బొత్స హాజరైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసందే.




