Wednesday, 4 November 2026

సీమ వెనుకబాటుకు పాలకులే కారణం : జేపీ

హైదరాబాద్‌: రాయలసీమ వెనుకబాటుకు కారణం పాలకులేనని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ అన్నారు. టీ బిల్లు చర్చపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వాల్సిందేనని విభజనతో నష్టపోయిన వారికి న్యాయం చేయాల్సిన జేపి కోరారు. రాయలసీయలో ఏటా ఉత్పత్తి రంగం పడిపోతోందని ఆయన వివరించారు. పేదరికం వెనుకబాటుతనం అక్కడే ఎక్కువ ఉందని ఆయన చెప్పారు. రాయలసీమ, తెలంగాణలో ఆదాయాననికి మించి వ్యయం చేయాల్సిన వస్తోందని ఆయన పేర్కోన్నారు. కోస్తాలో ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడాల్సిందేనని కానీ సామరస్యంగా ఏర్పాడాలని జేపీ కోరారు. మూడు ప్రాంతాల ప్రజలను ఒప్పించడం సాధ్యమేనన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *