ఆప్, బీజేపీ మధ్యే పోటీ
త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌లోకి మారిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ, జనవరి 18 (జనంసాక్షి) :
పార్టీ కోరితే లోక్‌సభకు పోటీ చేస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. కేజీవ్రాల్ ఎట్టకేలకు శనివారం నూతన గృహంలోకి మకాం మార్చారు. ఇకపై తిలక్‌లేన్‌లోని త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌లో ఆయన నివాసం ఉండనున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రభుత్వం ఇచ్చిన ఐదు బెడ్ రూం డూప్లెక్ల్స్ ఇంటిని తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో నగర అభివృద్ధి శాఖ ఓ ఇంటిని ఏర్పాటు చేసింది. లుట్నియాన్స్ పరిధిలోని తిలక్ లేన్‌లో మూడు పడక గదులున్న ఇంటిని అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో పాటు, డ్రాయింగ్ హాల్, డైనింగ్ హాల్, ఇద్దరు పని మనుషులు ఉండేందుకు ఓ ఇంటిని, కారు పెట్టుకునేందుకు గ్యారేజీని సిద్ధం చేశారు. కేజీవ్రాల్ విజ్ఞప్తి మేరకే ఆయనకు తగిన వసతి గృహాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పాటియాల కోర్టుకు సవిూపంలోని1600 చదరుపు అడుగుల స్థలంలో ఉన్న ఆ ఇంటిలో కేజీవ్రాల్ ఉండనున్నారు. అంతకుముందు ఐదు బెడ్రూంల డూప్లెక్స్ పై పలు విమర్శలు రావడంతో కేజీవ్రాల్ వెనక్కి తగ్గారు.
పార్టీ కోరితే ఎంపీకి పోటీ చేస్తా




